Kalyanam Live Watch here- 23/05/2024

క్షేత్రం చరిత్ర

త్రేతాయుగంలో ద్వారకామహర్షి శ్రీవారి శేషాచ లకొండపై తపస్సు చేయగా తపస్సుకి మెచ్చి శ్రీమ హావిష్ణువు తన పాదాలను ద్వారకా మహర్షికి ఇచ్చారు. దీంతో ఈ క్షేత్రానికి ద్వారకాతిరుమల అనే పేరువచ్చింది. ఈ ఆలయంలో స్వయంచకుడైన శ్రీవారి పాదాలు వల్మీకం ( పుట్టమన్ను)లో ఉండ డంతో భక్తులకు శ్రీవారిపాదపూజ చేసేందుకు వైఖానస ఆగమశాస్త్రానుసారం పెద్దతిరుపతి నుంచి ప్రతిష్ఠస్వామిని తీసుకొచ్చారు. దీంతో ఒకే అంతరా లయంలో ఇద్దరు ధ్రువమూర్తులు ఉండడం ఈ క్షేత్రం ప్రత్యేకత. అలాగే ఎక్కడా లేనివిధంగా స్వామివారు దక్షిణాభిముఖంగా ఉండటం కూడా ఇక్కడి మరో ప్రత్యేకత మెక్కుబడుల నిమిత్తం పెద్దతిరుపతి వెళ్లలేని భక్తులు ద్వారకాతిరుమల శ్రీవారిసన్నిధిలో మొక్కుబడులు సమర్పించే సంప్ర దాయం ఇక్కడుంది. ఒకే విమానమందు ఇద్దరు ధ్రువమూర్తులు ఉండడంతో బ్రహ్మోత్సవాలు సంవ త్సరానికి రెండుసార్లు జరుగుతున్నాయి. స్వయంవ్యక్తుడైన స్వామివారికి ఆశ్వయుజ మాసం లోను ప్రతిష్టస్వామివారికి వైశాఖమాసంలోనూ ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.

శ్రీవారి ఆశ్వయుజమాస బ్రహ్మోత్సవాలు


ద్వారకా శ్రీనివాసుని కల్యాణానికి క్షేత్రం సర్వం ముస్తాబయ్యింది. దివ్యకల్యాణాన్ని కను లారా వీక్షించేందుకు భక్తులు సిద్ధమయ్యారు. జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందు తోన్న ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆశ్వయుజమాస బ్రహ్మోత్సవాలను పుర స్కరించుకొని క్షేత్రానికి రమణీయంగా సాబగులు అద్దారు. ఆలయగోపురాలు కొత్త శోభను సంతరించుకొన్నాయి. దివ్యమంగళ స్వరూపధారుడై, ధవళకాంతులలో ఉన్న శ్రీ వారిని బ్రహ్మోత్సవాలలో కనులారా వీక్షించేం దుకు భక్తులు ఎదురు చూస్తున్నారు. ఆ మధుర క్షణాలను చూసి పునీతులయ్యేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తున్నారు.శ్రీవారి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల నిమిత్తం క్షేత్రం సర్వాంగసుంద రంగా ముస్తాబయింది.

ఇక్కడ బసచేయవచ్చు


శ్రీవారి క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం పలు సత్రాలను దేవస్థానం నిర్మించింది. నూతనంగా శేషాచలకొండపై 120 గదుల సత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఇది భక్తులకు అందుబాటులోకి వచ్చింది. అలాగే గ్రామంలో చిన్నాయమ్మారావు సత్రం, ఆళ్వార్ సత్రం, టిటీడీ సత్రం, మావులేటి సోమరాజు సత్రం, దేవస్థానం భక్తుల కోసం నిర్మించింది. కొండపైన డార్మెటరీ నిర్మించి కేవలం 10 రూపాయలకే భక్తులకు వసతిని కల్పించారు. అలాగే క్షేత్రంలో ప్రయివేటు సత్రాలు అనేకం ఉన్నాయి. ద్వారకాతిరుమలలోని ఉపాలయాలను భక్తులు దర్శించే నిమిత్తం ఆలయం ఉచిత బస్సుని కూడా ఏర్పాటు చేసింది. భక్తులకు మెరుగైన సేవలందించేందుకు కొండవైన అనేక అతిథి గృహాలున్నాయి. పర్యాటకశాఖవారు పున్నమి హోటల్ ని నిర్మించారు. •


ఉపాలయాలు, పర్యాటకకేంద్రాలు


ద్వారకాధీశుని ప్రధాన ఆలయానికి ఉపాల యాలు అనేకం ఉన్నాయి. ద్వారకాతిరుమలలో కొండ పైన

వీటిలో శివా లయం, పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది. క్షేత్రంలో 80 అడుగుల భారీ అంజనేయస్వామి వారి విగ్రహం, మరో 80 అడుగుల భారీ గరుత్మం తుడి విగ్రహాలను దేవస్థానం నెలకొల్పింది. అలాగే శ్రీవారి తూర్పురాజగోపురం వద్ద 70 అడుగుల అన్నమాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ద్వారకాతిరుమలకి దగగ్రలో సందర్సించతగ్గ ప్రదేశాలు

  • గుంటుపల్లె
  • శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయం, గురవాయగూడెం, జంగారెడ్డిగూడెం
  • పారిజాత గిరి వేంకటేశ్వరస్వామివారి ఆలయం, జంగారెడ్డిగూడెం

ఇలా రావచ్చు


ద్వారకాతిరుమల క్షేత్రానికి చెన్నై నుంచి కల కత్తా వెళ్లే రైలుమార్గాన ఏలూరుకి 11 కిలోమీ టర్లు దూరంలో ఉంది. భీమడోలుకి 17 కిలోమీ టర్లు, చెన్నై నుంచి కలకత్తా వెళ్లే రోడ్డుమార్గాన భీమడోలు ఆంక్షను నుంచి 15 కిలోమీటర్లు ఉంది. ద్వారకా తిరుమలకు ప్రతిరోజు ఏలూరు, తాడేపల్లిగూడెం, నర్సాపురం, తణుకు, జంగారెడ్డి గూడెం, సత్తుపల్లి, భీమవరం, భద్రాచలం, ఉయ్యూరు, విజయవాడ, గన్నవరం, గుడివాడ. మచిలీపట్నం డిపోల నుంచి ఆర్టీసీబస్సులను నడుపుతోంది. అలాగే పర్యాటక శాఖ హైదరా బాదు నుంచి హైటెక్ బస్సు నడుపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *