ద్వారకాతిరుమలకొండలలో నెలకొన్న కోనేటి రాయుడి పాదపద్మాలు తిరువీధి సేవకు పయనమయ్యాయి. రథ వాహనంపై (dwaraka tirumala rathotsavam)సాక్షాత్కరించిన దేవదేవుని దివ్య మంగళ స్వరూపాన్ని వీక్షించిన భక్తజనులు పారవశ్యం పొందారు. గోవింద నామస్మర ణతో ఆ ప్రాంతం మారుమోగింది.

ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంలో రాత్రి జరిగిన రథవాహనంపై శ్రీవారి తిరువీధిసేవ ఆద్యంతం కన్నులపండువగా జరుగుతుంది. బ్రహ్మోత్సవ సమయంలో శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం మరుసటి రోజున రధోత్సవాన్ని జరపడం సంప్రదాయం. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆల యంలో విశేష కార్యక్రమాలు జరుగుతాయి. నిత్యార్చన, హోమాలు, కోలాటభజనలు, భక్తి సంకీర్తనలు, వేదపారాయణలు, ఆలయంలో నిర్వహిస్తారు.

సాయంత్రం శ్రీవారి రథ శాలలో ఉన్న రథాన్ని శ్రీస్వామివారి సన్నిధి ప్రాంతానికి తెస్తారు. రధాన్ని పుష్పమా లికలు, మామిడితోరణాలు, విద్యుత్ దీపాలతో నయనానందకరంగా అలంకరిస్తారు. ఆలయంలో కల్యాణశ్రీనివాసుని, ఉభయదేవేరులతో తొళక్కం వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణలు, పూజలుచేస్తారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయి డ్యాలు, ప్రత్యేకడప్పు నృత్యాలు, కోలాట భజనలునడుమ ఉభయదేవేరులతో శ్రీవారు రధం వద్దకు వస్తారు. అక్కడ భక్తులు స్వామివారికి హారతులిస్తారు.

అంతకుముందే రధవాహనంపై ఏర్పాటుచేసిన రజిత సింహాసనంపై కల్యాణమూర్తులను ఉంచి ప్రత్యే కపూజలు జరిపిస్తారు. నీరాజనాలు సమర్పించారు. వేదమంత్రోచ్చరణలు, మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ శ్రీవారి రధవాహనం తిరు వీధులకు పయణానికి సిద్ధం అవుతుంది.

రధవాహనంపై(dwaraka tirumala rathotsavam) కొలువై ఉన్న శ్రీవారిని, అమ్మవార్లను ప్రత్యక్షంగా మోసే అనుభవాన్ని పొందిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగారు. సాధా రణంగా శ్రీవారికి జరిగే వాహనసేవలలో భక్తులకు స్వామివారిని మోసే అవకాశం లభించదు. అయితే రథవాహనంలో ఈ అవకాశం లభించడంతో భక్తులు అమితానం దాన్ని పొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *